Wednesday, November 1, 2017

అదేహ ప్రేయసి


నీ జ్ఞాపకాలు నిండిన రాత్రివేళ
నిర్నిద్ర దేహం
అస్వప్న జలాలలో పయనించే
గూటి పడవ అవుతుంది.
నీ రూపం, నీ నవ్వు, నీ వీడ్కోలు
నా మూసుకొన్న కనురెప్పల వెనుక
అద్దం ముందు పిచ్చుకలా
రెక్కలు ఆడిస్తూ, పొడుస్తూ,
మిథ్యా ప్రియునితో రమిస్తున్నాయి
బయటకి వెళ్ళిపోండి అని
చెప్పాలనుకొంటాను వాటితో
ఈ భారాన్ని నేను మోయలేను
అని అరవాలనుకొంటాను.
నీ చుంబనంలో బంధీ అయిన
నా పెదవులు తెరుచుకోవు.
నా గొంతులో కూడా
నువ్వే చిక్కుకొని ఉన్నావు.
బొల్లోజు బాబా

2 comments:



  1. నీ రూపం నీ నవ్వూ
    ఆ రెక్కల వూపు, పొడుపు, ఆహ్! ప్రియ! మి
    థ్యారామంబై మత్తున
    భారమునిక మోయలేక బంధీ నయ్యా !

    జిలేబి

    ReplyDelete